E-PAPER

మెదక్ జిల్లా చేగుంట అప్పుల బాధతో పరిశుద్ధ కార్మికుడు ప్రశాంత్ ఆత్మహత్య

చేగుంట మార్చ్ 11 వై సెవెన్ న్యూస్

చేగుంట మండలం తిమ్మాయపల్లి గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు ప్రశాంత్ ఆత్మహత్య మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు సిఐటియు మెదక్ జిల్లా నాయకురాలు బాలమణి ఆసిఫ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంత్ అనే కార్మికుడు పరిశుద్ధ కార్మిక విభాగంలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు చాలీచాలని జీతంతో భార్య పిల్లలు లతో జీవనం కొనసాగిస్తున్నాడు ప్రభుత్వం వారు ఇస్తున్న వేతనం సరిపోక అప్పులు చేసి అప్పులు తీర్చలేక మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పరిశుద్ధ కార్మికులకు సరైన వేతనాలు ఇస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామపంచాయతీ కార్మికులకు పర్మినెంట్ చేస్తామని వాళ్లకు రెగ్యులర్ ప్రతినెల వేతనాలు ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని మీడియాతో వాపోయారు తక్షణమే మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సిఐటియు నాయకురాలు బాలమణి ఆసిఫ్ పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్