రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 11 నెలలు కావస్తున్న విద్యాశాఖ మంత్రిని నియమించర
విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష జరపాలి
శిధిల వ్యవస్థల చేరిన భవనాల పనులు ప్రారంభించాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశి
జూలూరుపాడు నవంబర్ 13: మండల కేంద్రంలో అఖిల భారత విద్యార్థి ముఖ్య కార్యకర్తల సమావేశం పాల్గొని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ మాట్లాడుతు ప్రజా ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 11 నెలలకు కావస్తున్న ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం బాధాకరమని అన్నారు. విద్యాశాఖ పై కనీసం ఒక్కసారి కూడా ప్రభుత్వం సమీక్ష నిర్వహించకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వం విద్యార్థుల పై సవతి తల్లి ప్రేమ కనబరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో సమస్యల నిలియంగా మారాయని, ఉన్నత అధికారుల పర్యవేక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు పాఠశాలలో గదులు లేక మంచినీటి సౌకర్యం లేక విద్యార్థుల అవస్తలు పడుతుంటే కొన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కూడా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు పేద మధ్యతరగతి విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ పునీత్ కుమార్ సాయి తేజ తదితరులు పాల్గొన్నారు