పల్నాడు, నవంబర్ 13 y7 న్యూస్
పల్నాడు జిల్లాలో నాటు సారా తయారీని పూర్తిగా అరికడతామని ఉమ్మడి గుంటూరు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన మద్యం అమలు విధానంలో కచ్చితంగా నిబంధనలు పాటించేలా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. పల్నాడు జిల్లాలో అక్కడక్కడ ఇంకా నాటు సారా తయారీ జరుగుతుందని అన్నారు. నాటు సారా రహిత పల్నాడు జిల్లాగా మార్చడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. బెల్టు షాపులు నిర్వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మద్యం నీ ఎమ్మార్పీ ధరలకే అమ్మాలని వ్యాపారస్తులకి ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎమ్మార్పీ నిబంధన అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంకా ఏపీకి లిక్కర్ బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని అన్నారు. దాన్ని పూర్తిగా అరికడతామన్నారు. ఇతర రాష్ట్రాల్లో నుంచి మద్యం బ్లాక్ మార్కెటింగ్ వ్యాపారం జరగకుండా నిరోధిస్తామన్నారు.