మధ్యప్రదేశ్,అక్టోబర్13 వై 7 న్యూస్;
దుర్గమ్మకు ఓ భక్తుడు ఏకంగా తలనే సమర్పించాలనుకున్న ఘటన మధ్య ప్రదేశ్ లోని ‘మా బీజాసన్’ లో జరిగింది.గుడికి శుక్రవారం వచ్చిన భక్తుడు తన తలను సమర్పించాలని యత్నించాడు. రేజర్ తో మెడ కోసుకుంటుండగా ఇతర భక్తులు అడ్డుకున్నారు. అప్పటికే లోతుగా తెగిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సర్జరీ అనంతరం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. 9 రోజుల పాటు ఉపవాసం ఉండి తల ఇచ్చేందుకు ఆలయానికి వచ్చాడని పోలీసులు తెలిపారు.
Post Views: 575