E-PAPER

ములుగు క్యాంప్ ఆఫీసులో మంత్రి సీతక్క దసరా ప్రత్యేక పూజలు

ములుగు,అక్టోబర్ 13 వై 7 న్యూస్

. విజయదశమి సందర్భంగా ములుగు లోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయుధపూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క తన భద్రతా సిబ్బంది ఆయుధాలకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రి సీతక్క

. జమ్మి కొమ్మకు శమీ పూజ నిర్వహించిన మంత్రి సీతక్క

. ములుగు క్యాంప్ ఆఫీస్ లో కుటుంబ సభ్యులు, తన భద్రత వ్యక్తిగత సిబ్బందితో కలిసి మంత్రి సీతక్క దసరా ప్రత్యేక పూజలు

– రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు

– రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. పాప వినాశనానికి, సత్యానికి ధర్మానికి చిహ్నంగా నిలిచే దసరా సామూహిక వేడుకకు ప్రతీక గా నిలుస్తుందన్నారు. తెలంగాణ పెద్ద పండుగ దసరాను సోదర భావంతో, అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్