E-PAPER

పీవీ కాలనీ ఏరియా లో గోశాల నిర్మాణం చేపట్టి గోవులను సంరక్షించాలి

ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి.

మణుగూరు అక్టోబర్ 13 వై7 న్యూస్;

బాంబే కాలనీ ప్రారంభం మొదలు సింగరేణి పాఠశాల వరకు నిత్యం గుంపులు గుంపులుగా ఆవులు ప్రధాన రహదారి పైనే ఉండడం వల్ల రాకపోకలు సాగించే కార్మిక వారి కుటుంబ సభ్యులు,మహిళలు,చిన్నారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి తెలియచేశారు. రాత్రి పూట విధులకు హాజరయ్యే కార్మికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాల బారిన పడుతున్నారని ఆయన తెలియచేశారు.. ఆవులు రహదారి పై ఒకటికి ఒకటి ఘర్షణ పడుతూ రాకపోకలు సాగించే వారి మీదకు వెళ్తున్నాయని ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళే చిన్నారులకు ఆవుల గుంపులు మరింత ఇబ్బందిగా తయారైనాయని తెలిపారు.. ప్రతి గురువారం నాడు కొనసాగే సంతలో ఆవుల బెడద తీవ్ర రూపం దాల్చుతుందని తెలిపారు.. ఆవు తల్లి తో సమానమని కొంత మంది వ్యక్తులు వాటిని అకారణంగా కొడుతూ గాయాల పాలు చేస్తున్నారని వాటిని బాధ పెట్టడం వల్ల మంచిఫలితాలు కలగవని హిందూ సంప్రదాయ పురాణాలు తెలియ చేస్తున్నాయని వాటి సంరక్షణ కోసం యాజమాన్యం ప్రత్యేక చొరవ తీసుకుని కాలనీ ఏరియా లో గోవులకు ప్రత్యేక గోశాల ఏర్పాటు చేయాలని సూచించారు..33 కోట్ల దేవతలు, సర్వ తీర్ధాలు, వేధములు అన్ని కూడా గోవులో ఇమిడి ఉన్నాయని సనాతన ధర్మం సూచిస్తుందని అంతటి పరమ పవిత్రమైన ఆవును సంరక్షించే గోశాల నిర్వహణ భాధ్యత యాజమాన్యం చేపట్టడం వల్ల సంస్థ మరింత ప్రగతి సాధిస్తుందని ప్రమాదాల నివారణకు దోహద పడుతుందని తెలిపారు.. కాలనీ ఏరియాలో నిర్మించి ఉన్న ఆలయాల్లో ఉన్న మూర్తులకు అభిషేకాలు ఆవు పాలు, పెరుగు, నెయ్యి తో చేయడం మూలంగా అభిషేకాలు మరింత సత్ఫలితాలు ఇస్తాయని తెలిపారు.. గోశాల నిర్మాణం వల్ల ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాలలో నివసించే వారికి కూడా ఉపాధి కల్పనకు దోహద పడుతుందని తెలిపారు.నిత్యం ఆలయాల్లో జరిగి యజ్ఞాలకు అడవిలో తెచ్చే కట్టెలతో కాకుండా ఆవు పిడకలతో చేయడం వల్ల కల్మషం లేని వాతావరణంను తయారవుతుందని దానివల్ల కాలనీ ఏరియా లో నివసించే వారికి రోగాల బారిన పడకుండా విముక్తి దొరుకుతుందని తెలిపారు. గోశాల నిర్మాణం వల్ల కాలనీ ఏరియా లో ఉన్న ఆలయాలకు ఓ చక్కటి అర్ధిక వనరుగా ఉపయోగపడుతుందని ఉపాధి కల్పనను ఉపకరిస్తుందని ఆవు మూత్రం, ఆవు పేడ తో అగర్బత్తిలు, దూబ్ స్టిక్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయవచ్చని స్త్రీ ప్రసవించిన తర్వాత బిడ్డకు సరిపడా పాలు లేకపోతే ఆవు పాలు ఏంతో ఉపకరిస్తాయని క్యాన్సర్ లాంటి మహమ్మారి కణాలను తరిమి కొట్టే శక్తి వంతమైన కారకాలు ఆవు ద్వారా లభించే ఉపకరణల్లో ఉన్నాయని. మహిళలు సైతం గోశాల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారని సమాజ హితవు కు దోహదపడే గోశాల నిర్మాణం పై యాజమాన్యం దృష్టి సారించాలని ఆయన తెలియచేశారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News