మంగపేట, అక్టోబర్02 వై 7 న్యూస్;
కొద్దిసేపటి క్రితం మంగపేటలో గాలి దుమ్ము వర్షం బీభత్సం సృష్టించింది. ఐదు నిమిషాల్లో మంగపేట మండలం అతలాకుతులమైంది. వచ్చినటువంటి వర్షానికి పూర్ణసాపురం నుండి బుచ్చంపేట వెళ్లే దారిలో చెట్లు విరిగిపడడం వలన రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. శివాలయం ప్రాంతంలో పురాతన చింత చెట్టు నెలకూలింది. మంగపేటకు పోలీస్ క్వార్టర్స్ సమీపంలో ఇంటి పైకప్పు రేకులతో సహా లేసి ఎగిరి పడింది. చాలాచోట్ల విద్యుత్ వైర్లు తెగిపోయాయి. అధికారులు స్పందించి వెంటనే చెట్టును తొలగించాలని, విద్యుత్ ను పునరుద్ధరించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Post Views: 381









