భద్రాద్రి జిల్లాకు సీతారామ నీళ్లతో న్యాయం చేయండి
బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులు కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాని వైఖరి;యెర్రా కామేష్,జలాల్
సుజాత నగర్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుతో అన్ని నియోజకవర్గాలకు నీళ్లు అందించాలని డిమాండ్ తో బీఆర్ఎస్ పార్టీ నాయకుల నిరసన చేయకుండా అక్రమంగా అరెస్టు చేయడం పలు స్టేషన్లకు నాయకులను తరలించి నిర్బంధించడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగాని వైఖరి కి నిదర్శనమే అని పలువురు నాయకులు అన్నారు నేడు సుజాతనగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న నాయకులను పరామర్శించి ప్రభుత్వ చర్యను ఖండించారు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి జిల్లాకు ప్రతి మండలానికి నీళ్ల అందించేలా డిపిఆర్ మార్చాలని లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం తప్పదని వారి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్,తెలంగాణ ఉద్యమకారుడు బండి విజయభాస్కర్,సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్,తెలంగాణ ఉద్యమకారుడు యాకుబ్ అలీ









