78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ కామేపల్లి మండలంలో రైతు వేదిక, ప్రైమరీ స్కూల్, పండితాపురం అంబేద్కర్ సెంటర్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం రాకముందు దాదాపు 100 ఏళ్ల ముందు నుంచే ఎన్నో పోరాటాలు ఉద్యమాలు జరిగాయని, ఎందరో తమ ప్రాణాలను త్యాగం చేసి అమరులయ్యారని, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వెళ్ళగొట్టి, మనకు స్వేచ్ఛను ప్రసాదించారని , వారి త్యాగ ఫలితంగా నేడు స్వేచ్ఛను అనుభవిస్తున్నామని, ప్రతి ఒక్క భారతీయుడు వారిని గుర్తు చేసుకుని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు బ్రిటిష్ వారు వెళ్లిపోయాక కూడా ఇంకా వారి చట్టాలు అమలు కావడం మన దురదృష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నులు ఎగ్గొట్టిన వారిని, నల్లధనం విదేశాలలో దాచిన వారిని, రాజ లాంచనాలతో పాలకులు గౌరవిస్తున్నారని, ఎన్నికలప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం రైతే రాజు అని, రైతుల కోసం తాత్కాలిక ప్రయోజనాల కల్పిస్తారని, కానీ శాశ్వతంగా ఏ విధంగా చూసినా రైతు నలిగిపోతూ అవస్థ పడుతున్నాడని రైతును పట్టించుకునే నాథుడే లేడని, రాజ్యాంగంలో కొన్ని లోపాలను సరి చేయాలని రాజకీయ పార్టీలు ఒత్తిడి తెస్తున్నాయని, కానీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలను క్రింది స్థాయి మనిషికి పూర్తిస్థాయిలో అందడం లేదని, ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటికీ దేశంలోఆకలి, పేదరికం, కుల వివక్ష, లింగ వివక్ష, అసమానత్వం ఇంకా అలాగే ఉన్నాయని, ఇవన్నీ నిర్మూలించబడి మంచి రోజులు వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లుగా ఉంటుందని, మనకంటే వెనక స్వాతంత్రం తెచ్చుకున్న దేశాలు, ఎన్నో విధాలుగా ఆర్థికంగా బలపడిపోయాయని, మన దగ్గర రాజకీయ కుట్రల వల్ల అభివృద్ధి చెందలేకపోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు, మాజీ సర్పంచ్ బానోత్ నరసింహ నాయక్ శీలం పుల్లయ్య ,ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్యా నాగేంద్రబాబు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్, చల్ల మల్లయ్య, జక్కంపూడి వెంకటేశ్వర్లు, మంద రవి మోదుగు రాము, డేరంగుల తిరపయ్య రాయల నాగ శంకర్, బానోత్ లక్ష్మ, గుండ్ల వెంకన్న, శీలపాక ఉపేందర్, విద్యార్థులు ఉపాధ్యాయులు, మహిళా సంఘాల నాయకులు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు









