కామారెడ్డి జిల్లా
వై7 న్యూస్ తెలుగు
ఆగస్టు: 15-08-2024
ఆర్డిఓ గారు… ఇదేం పని.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అవమానకర సంఘటన చోటు చేసుకుంది.జెండాకు వచ్చిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు,తదితరులు చెప్పులు, షూలు ఏకంగా జెండా గద్దెకు దూరంగా వదిలేసారు., కానీ ఒక బాధ్యత గల హోదాలో ఉన్న బాన్సువాడ ఆర్డీఓ రమేష్ రాథోడ్ మాత్రం ఏకంగా బూట్లు వేసుకొని జాతీయ జెండా ఎగరవేసే దిమ్మ వరకు బూట్లు వేసుకొని వచ్చారు. ఆ దిమ్మ వద్ద బూట్లు వదిలేయడంతో, దీనిని గమనించిన అటెండర్ దిమ్మె వద్ద ఉన్న ఆర్డిఓ బూట్లను చేతులు పట్టుకొని బయటకు తీసుకువచ్చి పెట్టడం చర్చనీయాశంగా మారింది. జెండా ఆవిష్కరణకు వెళ్లిన ఆర్డీవో రమేష్ రాథోడ్ బూట్లను అటెండర్ తన చేతిలో పట్టుకొని బయటపెట్టారు. ఆర్ డి ఓ గారు…. ఇదేం పని అంటూ సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.









