E-PAPER

బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా,78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసిన *బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు మేలాపురం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ* స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారని ఈ రోజున ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా జెండా ఎగురవేస్తున్నామంటే ఆ జెండా వెనుక ఎంతోమంది ప్రాణ త్యాగాలే కారణమన్నారు బ్రిటిష్ వారు మన భారతీయులను హింసించి మన వనరులను వారి దేశానికి తరలించే వారని తెల్ల దొరల హింసను అరికట్టేందుకు ఆనాడు దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులు తెల్లవారితో ఎన్నో పోరాటాలు చేసి తెల్లదొరలను తరిమికొట్టారని స్వాతంత్ర్యం కోసం సుదీర్ఘమైన, కష్టతరమైన పోరాటం ముగింపును స్మరించుకుంటూ దేశం కోసం ప్రాణాలను సైతం త్యంగా చేసిన పోరాట వీరులను తలచుకుని నివాళులు అర్పించారు, 1947 ఆగస్టు 15న మన దేశానికి పూర్తి స్వాతంత్రం మనకి వచ్చిందని అందుకే ప్రతి సంవత్సరం ఆగష్టు 15వ తేదీని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటున్నాము అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్,ఏఐటీయూసీ మండల అధ్యక్షులు, రాయపూడి రాజేష్,ఏఐటీయూసీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్, మల్లెం మోహన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి, ఈనపల్లి పవన్ సాయి, ఏఐఎస్ఎఫ్ పినపాక నియోజకవర్గం కార్యదర్శి అక్కినపల్లి నాగేంద్రబాబు, అశ్వాపురం మండలం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, సహాయ కార్యదర్శులు, ముద్దుశెట్టి నరసింహారావు, తోట వెంకట నరసయ్య, ఎడెల్లి కమలాకర్, మోత్కూరు బాబురావు, కొండా కృష్ణ, దావ రమేష్, పోడియం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు..

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News