మణుగూరు;
99 రోజుల ప్రజా పాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా, మే 25 నుండి మే 30 వరకు నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా గుట్ట మల్లారం అంగన్‌వాడీ కేంద్రంలో “బాల్య వివాహాలు – బతుకు ఆగం” అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి జయలక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును నాశనం చేస్తాయని, ప్రతి ఒక్కరూ వాటిని అరికట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బాలికల విద్య, ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు హైమావతి, పద్మ, భద్రమ్మ, అంగన్‌వాడీ టీచర్లు రమాదేవి, యశోద, వెంకటరమణ పాల్గొని బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొమరం మధుకిరణ్, గ్రామస్తులు, తల్లులు, కిషోర బాలికలు పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా బాల్య వివాహాల నిర్మూలనపై గ్రామస్థుల్లో చైతన్యం పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు.








