E-PAPER

పసారా చట్టం ఉల్లంఘించిన సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థల పై కేసులు

ఖమ్మం;

ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రైవేట్ భద్రతా సంస్థలపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో పసారా చట్టం ప్రకారం అవసరమైన అనుమతులు లేకుండా ప్రైవేట్ భద్రతా సంస్థలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసేందుకు చర్యలు చేపట్టారు.కేసులు నమోదుకానున్న భద్రతా సంస్థలు మరియు నిర్వాహకులు వీరు:

వీరెల్లి నవనీత్ చౌదరి భద్రతా మరియు హౌస్ కీపింగ్ మాన్ పవర్ సర్వీసెస్ – వీరెల్లి శ్రీనివాసరావు

ఏఎస్పీ భద్రతా మరియు హౌస్ కీపింగ్ సర్వీసెస్ – పి. సుభాష్

ఎంఆర్ భద్రతా హౌస్ కీపింగ్ సర్వీసెస్ – గొల్లమందల మంగయ్య

సమైక్య హౌస్ కీపింగ్ సర్వీసెస్ – మందాడి సామ్రాజ్యం

వీరు గత కొంతకాలంగా పసారా చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ, అనుమతులు లేకుండానే ప్రైవేట్ భద్రతా గార్డు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఖమ్మం టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ, పసారా చట్టం ప్రకారం అనుమతులు పొందకుండా భద్రతా సంస్థలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News