వై 7 న్యూస్ డెస్క్:
అగ్రశ్రేణి మావోయిస్టు నాయకుడు, సీసీ సభ్యుడు పూసనూరి నర్హరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.
హైదరాబాద్‌లో తెలంగాణ డీజీపీ C. V. Anand సమక్షంలో వీరు లొంగిపోయినట్లు తెలిసింది.ఈ విషయంపై మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో తెలంగాణ డీజీపీ అధికారికంగా పత్రికా సమావేశం నిర్వహించనున్నారు.మావోయిస్టు పార్టీలో కీలక స్థాయిలో పనిచేసిన సంతోష్ లొంగుబాటు ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఎన్‌కౌంటర్లలో హతమవ్వగా, మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు.ఇటీవల తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు చేపడుతున్న ఆపరేషన్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీలో ఆందోళన నెలకొన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కీలక నేతల లొంగుబాట్లు పెరుగుతున్నాయని భద్రతా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.సంతోష్ లొంగుబాటుతో మావోయిస్టు పార్టీలో మరింత కలకలం రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి.








