అశ్వాపురం: మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని అధికారులు రాత్రికి రాత్రే తొలగించడంపై దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదుట దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం దళితుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని మండిపడ్డారు. వెంటనే విగ్రహాన్ని యథాస్థానంలో పునఃప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు, యువకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు అక్కడ మోహరించారు.
Post Views: 130








