పలాస, మే 22 (వై 7 న్యూస్):
కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎస్సై ఆర్. నరసింహమూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం పలాస మండలంలోని శివాజీనగర్ వార్డులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో కలిసి గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి నారీ శక్తి, కొత్త చట్టాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు.
గ్రామంలోని దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే గ్రామంలో పండుగలు, ఉత్సవాలు నిర్వహించే సమయంలో ముందస్తుగా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.
ఈ సందర్భంగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, బెట్టింగ్, పేకాట, గంజాయి, నాటు సారా అక్రమ రవాణా మరియు అమ్మకాలపై ప్రజలకు వివరించారు. అదేవిధంగా బాల్య వివాహాల నివారణ, మహిళలపై జరిగే నేరాలు, అత్యవసర సేవల కోసం 112 కాల్ వినియోగం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.








