E-PAPER

దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో SHOగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై రాజేష్ కుమార్

దమ్మపేట;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో నూతన SHOగా ఎస్సై రాజేష్ కుమార్ నేడు పదవి బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ నుంచి బదిలీపై దమ్మపేటకు వచ్చిన ఆయనకు పోలీస్ సిబ్బంది స్వాగతం పలికారు.

ఎస్సై రాజేష్ కుమార్ గతంలో మణుగూరు పోలీస్ స్టేషన్‌లో సేవలందించారు. అనంతరం బదిలీపై వరంగల్‌కు వెళ్లిన ఆయన, తాజాగా దమ్మపేట పోలీస్ స్టేషన్‌కు నియమితులై బాధ్యతలు చేపట్టారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News