E-PAPER

ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా టీం తారక్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

భద్రాచలం (టౌన్), మే 20 (వై7 న్యూస్):
పట్టణంలోని చర్ల రోడ్డులోని కిరణ్ ఫ్లెక్స్ ప్రింటింగ్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదిన వేడుకలను టీం తారక్ భద్రాచలం అధ్యక్షుడు గరిమెళ్ళ సాయి కిరణ్, కార్యదర్శి బాచినేని మణిదీప్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
అనంతరం నిరుపేద 20 కుటుంబాలకు రూ.20 వేల విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ జిల్లా కార్యదర్శి ఎస్.కె అజీమ్, టీం తారక్ గౌరవ సలహాదారు విజ్జిగిరి రాజా కిరణ్ పాల్గొని మాట్లాడారు.
“భద్రాద్రి రాముడు ఆశీస్సులు ఆ తారక రాముడికి ఎల్లప్పుడూ ఉంటాయి. ఎటువంటి వృథా ఖర్చులు చేయకుండా ఎన్టీఆర్ అడుగుజాడల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మా అభిమాన నాయకుడు ఎన్టీఆర్ భవిష్యత్తులో తప్పకుండా సీఎం అవుతాడు” అని వారు పేర్కొన్నారు.
మంగళవారం విడుదలైన “డ్రాగన్” టీజర్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుందని, సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఎన్టీఆర్ అభిమానులుగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో భాచినేని అనిల్, రజాక్, అడ్వకేట్ మోహన్ కృష్ణ, తీగల అరవింద్, హీరో షోరూం దుర్గ, ముక్కరభోయిన సత్యసాయి శ్రీనివాస్, రెడ్డిపాలెం కిరణ్, సిహెచ్ రాంబాబు తదితర టీం తారక్ అభిమానులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News