బూర్గంపాడు ;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన డీజిల్ పెట్రోలు గ్యాస్ ధరలను తగ్గించాలన ధర్నా నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలని, పెరిగిన ధరల కారణంగా నిరుపేద మధ్యతరగతి ప్రజానీకానికి మోయలేని భారం పడుతుందని, అంతేకాకుండా పెరిగిన డీజిల్ ధరల కారణంగా నిత్యవసరాలపై పడి ప్రజలకు మోయలేని భారం కానంది. కార్పొరేటర్ దోపిడీలు అరికట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం ప్రజల అవసరాలను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి పెంచిన ధరలను నియంత్రణకు కృషి చేయకుంటే భారత కమ్యూనిస్టు పార్టీ మరిన్ని ప్రజా పోరాటాలకు సిద్ధమవుతుందని ప్రభుత్వానికి తెలియజేశారు. బూర్గంపాడు మండల తహసిల్దార్ కార్యాలయం లో డిప్యూటీ తాసిల్దార్ కు మెమోరాండం అందించారు. ఈ యొక్క కార్యక్రమంలో బూర్గంపాడు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సప్కం నాగేశ్వరరావు, పెనుబల్లి మండల పార్టీ కార్యదర్శి సుధాకర్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు నల్లజాల సత్యనారాయణ,అలవాల సీతారాంరెడ్డి, సొల్లు పుల్లయ్య, సిద్ధారపు సుబ్బారెడ్డి, బర్ల వెంకటేశ్వర్లు, బూర్గంపాడు పట్టణ కార్యదర్శి ముదిగొండ బాలకృష్ణ, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కాటూరి రాము, పార్టీ నాయకులు కుంజ నాగరాజు, భూక్య నాగేశ్వరరావు, ఎట్టి బద్రి, సింగబోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.









