వై 7 న్యూస్ పలాస ;
పలాస మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జలధర–జలహారతి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీడీవో వసంత్ కుమార్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెరువులకు నీరు వచ్చే కాలువలను గుర్తించి, వాటిని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆయకట్టు పరిధి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సమావేశంలో ఏపీఓ, ఈసీ, ఇరిగేషన్ జేఈ, డీటీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
Post Views: 4








