E-PAPER

వజ్రపు కొత్తూరు మండలంలో వివాహిత అనుమానాస్పద మృతి

వై 7 న్యూస్ పలాస

శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం చిన్నపల్లి గ్రామానికి చెందిన 25 ఏళ్ల వివాహిత ఇందు సోమవారం రాత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది.
మృతురాలి తల్లి మాట్లాడుతూ, తన కుమార్తె మృతికి అత్త వరలక్ష్మి మరియు భర్త శంకరరావు కారణమని ఆరోపిస్తూ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల భర్త దుబాయ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
ఈ ఘటనపై వజ్రపు కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News