అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు
హాజరైన ఐక్య అయ్యప్ప గురు పీఠాల గురు స్వాములు
మహా అన్నదాన వితరణ, భక్తులకు మజ్జిగ పంపిణీ
మణుగూరు, : శ్రీ హరిహర సుతుడు అయ్యప్ప స్వామి వారి జన్మదిన నక్షత్రం ఉత్తరా నక్షత్రం సందర్భంగా అయ్యప్ప భక్త బృందం, ఐక్య అయ్యప్ప గురు పీఠా ల గురు స్వాముల ఆధ్వర్యంలో స్థానిక అశోక్ నగర్ లో స్వామి జన్మ దిన నక్షత్ర పూజలను మంగళవారం సతీష్ గురు స్వామీ ఆధ్వర్యంలో గురు స్వాములు అత్యంత వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహానికి పంచామృతాలతో వేడుకగా అభిషేకం చేశారు. వేడుకల్లో భాగంగా స్వామి వారి ని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం హోమం, అష్టద్రవ్య ఫల అభిషేకం, అలం కరణ, పుష్పార్చన,పూజ కైంకర్యాలు నిర్వహించగా అయ్యప్ప భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి నామ స్మరణతో కనులవిందుగా అభిషేక కార్యక్రమం కొనసాగింది.స్వామియే శర ణం అయ్యప్ప.. శరణం శరణం అయ్య ప్ప.. స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో ప్రాంగ ణమంతా మార్మోగింది. ఈ మహోత్సవా నికి పెద్దఎత్తున వివిధ అయ్యప్ప పీఠాల కు చెందిన గురు స్వాములు, భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మరణం, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు. భక్తుల అయ్యప్ప నామస్మరణతో ప్రాంగ ణంమంత ఆధ్యాత్మిక శోభను సంతరిం చుకుంది. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు, ఎండల దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం మజ్జిగ ప్యాకె ట్లను పంపిణీ చేశారు. ఈ పూజా వేడుకలలో సమితి సింగారం సర్పంచ్ ఉప సర్పంచ్ కలిబోయిన మాధ వరావు, గాండ్ల సురేష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు అనంతరం మధ్యాహ్నం (మహా భిక్ష) అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా సతీష్ గురు స్వామి మాట్లాడుతూ, స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా ప్రతినెల అయ్యప్ప జన్మదిన నక్షత్రం రోజున ప్రతి గురు పీఠం ఆధ్వ ర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈనెల అశోక్ నగర్ లో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తు న్నామని తెలిపారు. కార్యక్రమంలో అయ్యప్ప భక్త బృందం సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.








