శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడు గ్రామానికి చెందిన బుడత జగదీష్‌కు చెందిన ట్రాక్టర్ దొంగతనం కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే… జగదీష్ తన ట్రాక్టర్‌ను ఏప్రిల్ 23, 2026 రాత్రి ఎన్‌హెచ్-16 పక్కన ఉన్న తన శ్రీ రాజరాజేశ్వరి కార్ వీల్ అలైన్మెంట్ షాప్ ముందు పార్క్ చేసి ఉంచాడు. అయితే మరుసటి రోజు ఉదయం చూసే సరికి ట్రాక్టర్ కనిపించకపోవడంతో అది దొంగిలించబడినట్లు గుర్తించాడు.
దీంతో బాధితుడు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలు మరియు ఇతర ఆధారాల ఆధారంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన అన్న తురాయి (తండ్రి: సడియండి) అనే వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు.
పోలీసులు నిందితుడిని ఏప్రిల్ 27న అరెస్ట్ చేసి, ఏప్రిల్ 28, 2026న కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. కేసు పై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.








