మణుగూరు ;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో ఈరోజు గో ఆహ్వాన్ అభియాన్ సమస్త ఆధ్వర్యంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ మణుగూరు తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లింగంపల్లి రమేష్, కట్ల నరేష్ మాట్లాడుతూ— గోవుకు ఉన్న ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని తెలిపారు. మనిషి మనుగడలో గోవు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. గోవుతో సంబంధించిన ఉత్పత్తులు వ్యవసాయానికి ఉపయోగపడటంతో పాటు పర్యావరణానికి మేలు చేస్తాయని వివరించారు.
అలాగే గోవు మూత్రం, పేడ వంటి వాటికి వైద్య, వ్యవసాయ పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. గోమాతను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Post Views: 11








