ఎన్కూర్:
ఖమ్మం జిల్లా ఎన్కూర్‌లోని ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో కనీస సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కూర్చోవడానికి బల్లలు కూడా లేకపోవడం ప్రజలను ఆవేదనకు గురిచేస్తోంది.
చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి తరచుగా వస్తుంటారు. ఇందులో వృద్ధులు, వికలాంగులు కూడా ఉండటంతో వారు గంటల తరబడి నిలబడే పరిస్థితి ఏర్పడుతోంది.
కనీసం కూర్చోవడానికి కూడా ఒక బల్ల ఏర్పాటు చేయని పరిస్థితి అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా అధికారులు స్పందించి, కార్యాలయ ప్రాంగణంలో తగిన బల్లలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Post Views: 15








