E-PAPER

మెప్మ ఆధ్వర్యంలో స్వీయ జనగణనపై అవగాహన కార్యక్రమం

వై 7 న్యూస్ పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2026–27 జనగణన కార్యక్రమంలో భాగంగా, మెప్మ (MEPMA) ఆధ్వర్యంలో స్వీయ గణన (Self Enumeration) పై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పిడి మెప్మ శ్రీకాకుళం బి. శైలజ పిలుపు మేరకు మెప్మ సిబ్బంది, CLRPs మరియు RPలు పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రజలకు స్వీయ గణన ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘ సభ్యులకు ఈ ప్రక్రియపై వివరంగా అవగాహన కల్పిస్తూ, సాంకేతిక విధానాలపై కూడా సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 1500 మంది సంఘ సభ్యులతో స్వీయ గణన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి సరైన డేటా అందించడంలో ఇది కీలకంగా మారనుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో RPలు, DEO విజయ్, CLRPs తులసి, కవిత, సంధ్య, పద్మ, CMM మోహన్ మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News