వై 7 న్యూస్ పలాస
పలాస: పలాసలోని కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిలో ఇటీవల నిర్వహించిన మొట్టమొదటి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి కావడం తెలిసిందే. ఈ చికిత్స పొందిన హేమశ్రీను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదివారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా హేమశ్రీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, ఆమెకు మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. చికిత్సలో ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
అలాగే ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయం అందిస్తామని, హేమశ్రీ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే గౌతు శిరీష భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Post Views: 21









