వై7 న్యూస్ పలాస | మందస
మందస మండలం లోహరబంద గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రినే తనయుడు హతమార్చిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
గ్రామానికి చెందిన తాళ్ల లక్ష్మినారాయణ (60)ను ఆయన కుమారుడు ఏకాంబరరావు (32) దారుణంగా హతమార్చాడు. సమాచారం మేరకు, ఏకాంబరరావు మద్యానికి బానిసై పనిపాటు లేకుండా తిరుగుతున్నాడని తండ్రి తరచూ మందలించేవాడు.
ఈ క్రమంలో మరోసారి తండ్రి మందలించడంతో ఆగ్రహానికి లోనైన కుమారుడు తీవ్ర దాడికి పాల్పడి, తండ్రిని హతమార్చినట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న మందస పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనతో లోహరబంద గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ కలహాలు, మద్యపానం వంటి సమస్యలు ఎంతటి విషాదాలకు దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.









