వై 7 న్యూస్ పలాస
పలాస: జాగ్జీవన్ రాం జయంతి సందర్భంగా కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి ఆదివారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, బీహార్‌లో జన్మించిన బాబు జగ్జీవన్ రాం ప్రముఖ స్వతంత్ర సమరయోధుడిగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుడిగా నిలిచారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆయన, దళితుల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.
అలాగే సుమారు 30 సంవత్సరాలకు పైగా కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలు అందించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 14









