వై7 న్యూస్ భద్రాచలం
ఎమ్మెల్యే చేతుల మీదుగా హెచ్పీవీ టీకా అవగాహన పోస్టర్ ఆవిష్కరణ
14 ఏళ్లు నిండిన ప్రతి బాలికకు తప్పనిసరిగా హెచ్పీవీ టీకా వేయించాలి అల్లు అర్జున్ అభిమానుల పిలుపు
భద్రాచలం, ఏప్రిల్ 04:
మహిళల్లో గర్భాశయ ముఖ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో హెచ్పీవీ (HPV) టీకా అత్యంత కీలకమని వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలో, 14 సంవత్సరాలు నిండిన ప్రతి బాలిక తప్పనిసరిగా ఈ టీకా వేయించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ మేరకు భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా అల్లు అర్జున్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో హెచ్పీవీ టీకాపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బాలికల ఆరోగ్య పరిరక్షణలో హెచ్పీవీ టీకా ముఖ్యమైన రక్షణగా పనిచేస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ కుమార్తెలకు సరైన వయస్సులో టీకా వేయించేందుకు ముందుకు రావాలని సూచించారు.అలాగే, సమాజంలో మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచడం అత్యవసరమని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ అభిమాన సంఘం సభ్యులు చందు, రాజేష్, రియాజ్, మనోజ్, నాని, సాయి తదితరులు పాల్గొన్నారు.








