E-PAPER

మంత్రి పొంగులేటి పై విమర్శలు సహించం: మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పీరినాకి నవీన్

మణుగూరు;
స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పీరినాకి నవీన్ మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై చేసిన ఆరోపణలను ఖండించారు. ప్రజాసేవకు అంకితమై పనిచేస్తున్న నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధులను రాజకీయంగా ఎదుర్కోవాలని, కానీ కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం నీచమైన చర్య అని విమర్శించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నాయకులను ఎన్నుకుంటారని, చట్టసభల్లో వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు.
కడియం శ్రీహరి పై వ్యాఖ్యలపై ఆగ్రహం
మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తన స్థాయిని మించిపోయి ఇతర నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
దళిత నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, వెంటనే కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ సమావేశంలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోనగిరి శివ సైదులు, సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, వార్డు సభ్యురాలు కొలపిన్ని మానస, నాయకులు తూపూడి శ్రీను, షేక్ అబ్దుల్లా, చప్పిడి సుబ్రహ్మణ్యం, బొజ్జ త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News