వై 7 న్యూస్ పలాస
పలాసలో అంగన్వాడీ కార్మికులు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐసీడీయస్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి పలు కీలక డిమాండ్లు వినిపించారు.
అంగన్వాడీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ ఇవ్వాలని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయాలని వారు కోరారు. అలాగే ఆయాలకు ప్రమోషన్ గైడ్‌లైన్స్‌లో మార్పులు చేయాలని, పింఛన్‌తో కూడిన రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఇంకా, సేవలో ఉన్న సమయంలో మరణించిన అంగన్వాడీ కార్మికుల మట్టిఖర్చులు చెల్లింపులను సులభతరం చేయాలని కూడా కోరారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.అనంతరం ఐసీడీయస్ పి.ఓ. కె. పార్వతికి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి యన్. గణపతి, యూనియన్ అధ్యక్షురాలు బి. సునీత, కార్యదర్శి యం. మంజులా కుమారి, నాయకులు జి. నారాయణి, జయలక్ష్మి, యు. దానమ్మ, కరుణ, సీతా మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.








