E-PAPER

భద్రాచలం ఏరియా హాస్పిటల్‌లో వైద్యుల అద్భుత సేవలు ; బాబు ప్రాణాలు కాపాడిన టీమ్ వర్క్

భద్రాచలం;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండలం బుస్రాయ్ గ్రామానికి చెందిన ఒక నిరుపేద మహిళ తన సంవత్సరం వయసు బాబును తీవ్రమైన కాలిన గాయాలతో భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తీసుకొచ్చింది. బాబు కుడి కాలు పూర్తిగా కాలిపోవడంతో పాటు తీవ్రంగా బలహీనంగా ఉన్న పరిస్థితి వైద్యులను కూడా కలచివేసింది.ఈ క్లిష్ట పరిస్థితిలో హాస్పిటల్ సూపరింటెండెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో వైద్య బృందం వెంటనే చికిత్స ప్రారంభించింది. రెండు నెలల పాటు అవిశ్రాంతంగా శ్రమిస్తూ, ప్రతి రోజు బాబు ఆరోగ్యం మెరుగుపడేలా కృషి చేసింది.

ఈ చికిత్సలో భాగంగా డాక్టర్ పూజ (మెడికల్ ఆఫీసర్),సువర్ణ (న్యూట్రిషనల్ కౌన్సిలర్),స్టాఫ్ నర్సులు సుష్మిత, సురేఖ,కుక్ మంగా,మరియు నోడల్ ఆఫీసర్ డా. రాజశేఖర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.వారి సమిష్టి కృషితో బాబు పూర్తిగా కోలుకుని, ఈరోజు ఆరోగ్యంగా డిశ్చార్జ్ కావడం ఆనందాన్ని కలిగించింది.

ఈ సందర్భంగా సూపరింటెండెంట్ రామకృష్ణ Y7 న్యూస్ తో మాట్లాడుతూ…”ఇది ఒక్కరి విజయమే కాదు, మా మొత్తం టీమ్ వర్క్ ఫలితం. ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలని మా లక్ష్యం” అని తెలిపారు.ఇప్పుడా తల్లి తన బిడ్డను ఆరోగ్యంగా తీసుకుని వెళ్తూ చిరునవ్వుతో కనిపించడం, వైద్యుల సేవలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!