ఆర్ధిక సహాయం నిత్యవసర సరుకులు పంపిణీ
సఖి జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో పంపిణీ
మణుగూరు, మార్చి 30(వై 7 న్యూస్): సమాజ సేవలో ముందంజలో నిలిచిన సఖి జాతీయ మహిళా మండలి మరోసారి తన సేవా స్పూర్తిని చాటుకుంది. మండలి ఆధ్వర్యంలో స్థానిక పీకే సెంటర్ వద్ద నివసిస్తున్న క్యాన్సర్ బాధితుడు సాయికి ఆర్థిక సహాయం అందజేసి, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, సాయి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని తెలిపారు. అతని చికిత్స కోసం కొంతమేర ఆర్థిక చేయూత అందించడమే కాకుండా, కుటుంబానికి అవసరమైన బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను అందజేసినట్లు చెప్పారు.సమాజంలో ఇలాంటి బాధితులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు. సఖి జాతీయ మహిళా మండలి తరఫున భవిష్యత్తులో కూడా అవసరమైన వారికి సహాయం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సఖి మహిళా మండలి నేషనల్ కోఆర్డినేటర్ జన్నా స్వర్ణలత, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గైని లక్ష్మీబాయి, నేషనల్ జాయింట్ సెక్రటరీ వేముల స్వరూప, నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పెంట్యాల దీప్తి చౌదరి, సఖి సోదరీమణులు భాగ్యలక్ష్మి, పి లక్ష్మి, పి సత్యవతి, ఆర్ ధనలక్ష్మి, ఏ సూర్యవతి, కే లక్ష్మి, జ్యోతి, నాగలక్ష్మి, లావణ్య, లక్ష్మీ ప్రసన్న, దమ్మక్క, యాదమ్మ, రేణుక, నవ్య, సరస్వతి, శ్రీలక్ష్మి, ఉమా తదితరులు పాల్గొన్నారు








