వై 7 న్యూస్ పలాస
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నెలకొన్న ఉధృత పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం కాశిబుగ్గ గ్యాస్ గోడౌన్ వద్ద వందలాది మంది వినియోగదారులు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.లారీ వచ్చినప్పటికీ, పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో గ్యాస్‌ను అన్లోడ్ చేయకుండా ఏజెన్సీ ప్రతినిధులు నిలిపివేశారు. ఈ విషయంపై పలాస రెవెన్యూ శాఖ మరియు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రతినిధులు మాట్లాడుతూ వినియోగదారులు సహకరిస్తే, ఇంటి వద్దకే గ్యాస్ సరఫరా చేస్తాము అని తెలిపారు.
Post Views: 11








