వరంగల్ జిల్లాలో సంచలనం రేపిన ఘటనలో భాగంగా, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఎస్.ఐగా విధులు నిర్వహిస్తున్న ఎం. సురేష్‌ను సస్పెండ్ చేశారు.పోలీస్ కమిషనర్ Sunpreet Singh ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.ఎస్.ఐ సురేష్‌పై వచ్చిన ఆరోపణలపై నిర్వహించిన అంతర్గత విచారణలో అవి నిజమని తేలడంతో, శాఖాపరమైన చర్యలలో భాగంగా సస్పెన్షన్ విధించినట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటన పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
Post Views: 285








