ఖమ్మం: కత్తులు, గొడ్డళ్లతో విన్యాసాలు చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలు, పోస్టులను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న ఇద్దరిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఖమ్మం నగరంలోని పంపింగ్ వెల్ రోడ్డు ప్రాంతానికి చెందిన దొడ్ల చరణ్, దమళ్ళ సూర్యలను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు.
ఈ విషయాన్ని టాస్క్ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇలాంటి ఆయుధ విన్యాసాలకు సంబంధించిన పోస్టులు పెట్టే వారిపై నిఘా ఉంచినట్లు పోలీసులు తెలిపారు.
Y7 News Telugu | ప్రజల గొంతుక
Post Views: 11








