వై7 న్యూస్ – పలాస
మందస మండలం హరిపురం పెద్ద వీధిలో ఈ నెల 13న జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా చేధించారు. పొట్టి శాంతి ఇంట్లో 20 గ్రాముల బంగారం అపహరించబడిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మందస పోలీసులు, నిందితుడిని గుర్తించారు.బాధితురాలితో కలిసి స్వీట్ షాపులో వంట పనులు చేస్తున్న ఒడిశాకు చెందిన ఉమాకాంత్ బిశ్వర్ ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం కేసు వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు.
Post Views: 4








