మణుగూరు:
ముఖ్యఅతిగా అతిథిగా మణుగూరు మున్సిపాలిటీ ట్రైని కమిషనర్
మణుగూరు మండలం శివారు గుట్ట మల్లారం గ్రామం హనుమాన్ గార్డెన్స్‌లో జ్యోతి ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది ఔత్సాహిక కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రేక్షకులను అలరించారు.
సాధారణంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో మాత్రమే కనిపించే ఈ తరహా సాంస్కృతిక కార్యక్రమాలను మణుగూరు పట్టణంలో నిర్వహించడం విశేషమని స్థానికులు ప్రశంసించారు. ముఖ్యంగా మన ఊరి బిడ్డ, పూజారి జ్యోతి ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్టణానికి గర్వకారణంగా మారిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.కళాకారులకు వేదిక కల్పించడమే లక్ష్యంగా జ్యోతి ఈవెంట్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని నిర్వాహకులు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మణుగూరులో సాంస్కృతిక వాతావరణం మరింత ఉత్సాహంగా మారుతుందని వారు పేర్కొన్నారు. ప్రజల నుంచి కూడా ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఔత్సాహిక గాయనీ గాయకులు హాజరై తమ మధురమైన గాత్రంతో శ్రోతలను మైమరిపించి ఉర్రూతలూగించారు.వివిధ రకాల పాటలతో కార్యక్రమం కళకళలాడింది.








