E-PAPER

వజ్రపుకొత్తూరు మండలంలో ఎలుగుబంటి హల్‌చల్ – జీడితోటలో చిక్కుకున్న పిల్ల ఎలుగుబంటి

వై 7 న్యూస్ పలాస

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి సమీపంలోని జీడితోటలో ఎలుగుబంటి హల్‌చల్ చోటు చేసుకుంది. జీడితోటలో ఏర్పాటు చేసిన ఇనుప కంచెలో ఎలుగుబంటి పిల్ల చిక్కుకోగా, దాన్ని విడిపించుకునేందుకు తల్లి ఎలుగుబంటి తీవ్రంగా ప్రయత్నించింది.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆదివారం ఉదయం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు విశాఖపట్నం జూ వైద్యుల సహకారంతో ఎలుగుబంటి పిల్లకు మత్తు మందు ఇచ్చి సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఎలుగుబంటి పిల్లను విశాఖ జూకు తరలించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News