వై 7 న్యూస్ పలాస
మందస మండలంలో నేడు ఆంధ్రప్రదేశ్ ఒడియా టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేధా సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, విద్యార్థులు భవిష్యత్తులో రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ సురేష్ పాడి, ఒడియా టీచర్స్ అసోసియేషన్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 17








