వై 7 న్యూస్ | పలాస
దివంగత నేత, మాజీ ఎంపీ హనుమంతు అప్పయ్యదొర 91వ జయంతి కార్యక్రమాన్ని పలాసలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, దొర సోదరులు పెద్దలు హనుమంతు వెంకటరావు, కుమారులు రామ్మోహన్ దొర, దొర అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దివంగత హనుమంతు అప్పయ్యదొర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన ప్రజాసేవ, రాజకీయ ప్రస్థానం, ప్రజల కోసం చేసిన కృషిని నాయకులు గుర్తుచేశారు.
కార్యక్రమం మొత్తం జయంతి వేడుకల వాతావరణంలో కొనసాగగా, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని దొరకు ఘన నివాళులు అర్పించారు.
Post Views: 15








