వై 7 న్యూస్ పలాస
వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి–పెదబడం గ్రామాల మధ్య తారు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో స్థానిక టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు దువ్వాడ జయరాం చౌదరి, అప్పారావు మాట్లాడుతూ… స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష చొరవతోనే ఈ రోడ్డు నిర్మాణం సాధ్యమైందని పేర్కొన్నారు.
ఎన్నాళ్లుగానో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని, ఈ అభివృద్ధి పనుల ద్వారా గ్రామ ప్రజలకు రాకపోకలు సులభమవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
Post Views: 41









