వై 7 న్యూస్ పలాస
కాశీబుగ్గ ప్రభుత్వ పాఠశాలలో అవగాహన సదస్సు
కాశీబుగ్గ ప్రభుత్వ పాఠశాలను పోలీసులు సందర్శించి, విద్యార్థినులకు నారి శక్తి యాప్ వినియోగంపై శిక్షణ అందించారు. ఈ సందర్భంగా నారి శక్తి, సైబర్ నేరాలు, సంకల్పం కార్యక్రమం, మహిళలపై జరుగుతున్న నేరాలు, బాల్య వివాహాల నివారణ వంటి అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ సీఐ వై. రామకృష్ణతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొని, విద్యార్థినులకు కీలక సూచనలు చేశారు. సమస్యలు ఎదురైనప్పుడు నారి శక్తి యాప్ ద్వారా తక్షణమే సహాయం పొందవచ్చని వివరించారు.
విద్యార్థినులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, ధైర్యంగా ముందుకు రావాలని పోలీసులు సూచించారు.
Post Views: 17









