వై 7 న్యూస్ | పలాస
31 వినతులు స్వీకరణ… తక్షణ పరిష్కారాలకు ఆదేశాలు
పలాస నియోజకవర్గంలో ఎమ్మెల్యే గౌతు శిరీష తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఓపికగా విన్న ఎమ్మెల్యే, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేలా అధికారులకు సూచనలు చేశారు.
ఈ గ్రీవెన్స్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 31 వినతులు అందాయి. పెన్షన్లు, ఉద్యోగాలు, భూ వివాదాలు, ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు, సీసీ రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ప్రతి వినతిని పరిశీలించిన ఎమ్మెల్యే గౌతు శిరీష, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.









