పలాస;
పలాస రైల్వే స్టేషన్ సమీపంలోని ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలం టెండర్ విషయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒక వర్గానికి చెందిన వ్యక్తులు నాటు తుపాకీతో పాటు మారణాయుధాలు చూపిస్తూ మరో వర్గాన్ని బెదిరించిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది.
ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను శనివారం కోసంగిపురం జంక్షన్ వద్ద కాశీబుగ్గ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆదివారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ షేక్ సహబాజ్ అహమ్మద్ వెల్లడించారు.
Post Views: 60









