“వై 7 న్యూస్ పలాస
శాసనసభ్యురాలు గౌతు శిరీషమ్మ ఆదేనుశారాం
వజ్రపుకొత్తూరు మండలం పూండి వాణిజ్య కేంద్రంలో అభ్యుదయం సైకిల్ యాత్ర – డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబు , శ్రీకాకుళం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్ , పలాస మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు , రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు, వజ్రపుకొత్తూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కర్ని రమణ పాల్గొని, ఈ అవగాహన ర్యాలీ మరియు మానవహారంగా ఏర్పడి
యువతలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే భవిష్యత్ ప్రమాదాలపై అవగాహన కల్పించి మత్తు పదార్థాలకు “నో” చెప్పి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం జరిగింది.
సమాజంలో డ్రగ్స్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా ముందుకు రావాలని, యువతకు సరైన మార్గనిర్దేశం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సైకిల్ యాత్ర రూపంలో ఇలాంటి మంచి కార్యక్రమం రూపొందించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మరియు హోం మంత్రి వంగలపూడి అనిత కి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









