వైద్య చికిత్స కోసం రూ.25 వేల ఆర్థిక సహాయం
బూర్గంపాడు;
సారపాక పట్టణ పరిధిలోని వైష్ణవి మిల్క్ యజమాని కృష్ణమూర్తి గారి చిన్న కుమారుడు సాయి ఇటీవల శబరిమల యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు.
ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచిన మండల కాంగ్రెస్ పార్టీ, కూటమి నేతలు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.25,000/- ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సహాయాన్ని బూర్గంపహాడ్ మండల మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి రూ.10,000/-, సారపాక సర్పంచ్ కిషోర్ నాయక్ రూ.10,000/-, ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్ రూ.5,000/-గా అందజేసి బాధిత కుటుంబానికి చేయూతగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, INTUC జిల్లా యువజన అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పత్తి వెంకటేశ్వర రెడ్డి, స్థానిక నాయకులు తిరుపతి చంటి, కాటం వెంకట్రాం రెడ్డి, రహీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.









