కొత్తగూడెం;
కొత్తగూడెం నియోజకవర్గం, చుంచుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంతోటి పాల్ నివాసంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో డీసీసీ అధ్యక్షురాలు దేవిప్రసన్నతో కలిసి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ, క్రిస్మస్ యేసు క్రీస్తు జన్మదినాన్ని స్మరించుకునే పవిత్ర పండుగ అని, ప్రేమ, శాంతి, దయ వంటి మానవ విలువలను సమాజానికి చాటి చెప్పే సందేశం ఇందులో ఉందన్నారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలనే గొప్ప బోధను క్రిస్మస్ అందిస్తుందన్నారు.
కార్యక్రమంలో సుజాతనగర్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనుగుల అర్జున్ రావు, గడిపల్లి కవిత, ఓబీసీ పట్టణ అధ్యక్షులు జయప్రకాష్, జిల్లా సెక్రటరీ బొబ్బాల వెంకట్ యాదవ్, ప్రసాద్‌తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.









