వై 7 న్యూస్ పలాస
ఈశ్వరరావు ఆవేదన
పలాస మండలం బొడ్డపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 67/పిలో ఉన్న తన స్థలాన్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని బాధితుడు ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ స్థలాన్ని తాము సుమారు 30 ఏళ్ల క్రితం సుభాష్ వద్ద కొనుగోలు చేశామని, అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, 1బి, పాస్‌పుస్తకాలు అన్నీ తమ వద్ద ఉన్నాయని తెలిపారు. భూమిపై యాజమాన్య హక్కును నిర్ధారిస్తూ కోర్టు నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ కూడా పొందామని చెప్పారు.
అయితే ఇటీవల భూమిలో పనులు చేపట్టేందుకు ప్రయత్నించిన సమయంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు వచ్చి, స్థలాన్ని తమదని చెప్పి ఆక్రమించేందుకు ప్రయత్నించడమే కాకుండా దౌర్జన్య హెచ్చరికలు చేశారని ఆరోపించారు. “లేకపోతే నీ అంతు చూస్తాం” అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, అవసరమైతే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని ఈశ్వరరావు స్పష్టం చేశారు. అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరారు.









